ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీతో సమావేశం ఏపీ రాజకీయాల్లో చర్చకు తావిచ్చింది.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు.ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలపై కూడ ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వై.ఎస్. జగన్ చర్చించారని సమాచారం.విభజన చట్టంలోని హామీల అమలుపై కూడ చర్చించారని తెలుస్తుంది. విశాఖపట్టణంలోని ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని కూడ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిపైనే చర్చించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుమారు గంటకు పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ చర్చించారు.
రాజకీయ అంశాలపై కూడ చర్చ జరిగే ఉండి ఉంటుందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కానీ, అదేం లేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పెండింగ్ బకాయిలు, తెలంగాణ రాష్ట్రం నుండి విద్యుత్ బకాయిలతో పాటు విభజన అంశాలపైనే చర్చించారని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ప్రధానితో భేటీలో రాజకీయ అంశాల ప్రస్తావన ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
undefined
also read:రెండు రోజుల క్రితం బీజేపీ నేతలతో బాబు: నేడు మోడీతో జగన్ భేటీ
రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షాతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తెలుగు దేశం పార్టీని ఎన్‌డీఏలోకి ఆహ్వానించే విషయమై చర్చలు జరిగినట్టుగా ప్రచారం సాగుతుంది.ఈ భేటీ ముగిసిన రెండు రోజుల తర్వాత ప్రధాన మంత్రితో జగన్ సుధీర్ఘంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.