పర్యాటకులకు గుడ్‌న్యూస్: పాపికొండలకు బోటు యాత్ర ప్రారంభం

By narsimha lodeFirst Published Nov 7, 2021, 12:36 PM IST
Highlights


గోదావరి నదిలో పాపికొండల యాత్రను ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు తిరిగి ప్రారంభించింది. రెండేళ్ల క్రితం కుచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం కారణంగా పాపికొండల యాత్ర నిలిచిపోయింది. తిరిగి ఇవాళ ఈ యాత్ర ప్రారంభమైంది.

హైదరాబాద్: పాపికొండల విహారయాత్ర ఆదివారం నాడు ప్రారంభమైంది. గోదావరి నదిపై  Boat ద్వారా ప్రయాణం papikondaluకు చేరుకోవడానికి పర్యాటకులు ఇష్టపడతారు.  రెండేళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లా కుచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం నేపథ్యంలో Godavari River బోటు ద్వారా పాపికొండల యాత్రకు ఏపీ సర్కార్ బ్రేక్ వేసింది. రెండేళ్ల తర్వాత పాపికొండల యాత్ర ఇవాళ తిరిగి ప్రారంభమైంది.గండిపోశమ్మ ఆలయం వద్ద ఈ యాత్రను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు.

also read:Royal Vashista Operation: బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం స్పందన ఇదీ...

Andhra Pradesh ​లోని Devipatnamని పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు యాత్ర సాగనుంది. గోదావరిలో 26 మీటర్ల స్థాయిలో బోట్ల రాకపోకలకు అనుమతిచ్చారు.పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 40 మంది ప్రయాణికులు వెళ్లడానికి వీలుగా సర్‌ ఆర్ధర్‌కాటన్‌ బోటు అందుబాటులో ఉంది. త్వరలో 90 సీట్ల సామర్థ్యమున్న హరిత బోటును అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ పర్యాటక శాఖ. 

ఉదయం అల్పాహారం, బోటులోనే మధ్యాహ్న భోజనం అందిస్తారు. బోటింగ్‌ చివరి పాయింట్‌ పేరంటాలపల్లి. అక్కడ అరగంట విరామం ఇస్తారు. తిరిగి అదే మార్గంలో గండిపోచమ్మ కంట్రోల్‌రూమ్‌కు బోటు చేరుకుంటుంది. అక్కడినుంచి పర్యాటకులను తిరిగి ఉదయం ప్రారంభమైన ఏపీ టూరిజం కార్యాలయానికి సాయంత్రం ఏడింటికి చేరుస్తారు.

రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తీవ్రవిషాదం నింపింది. దీంతో యాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది పునఃప్రారంభించారు. వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర ఆదివారంనుంచి ప్రారంభం అవుతోంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాపికొండల యాత్రకు వెళ్లాలంటే ఏపీ టూరిజం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకోవాలి.పాపికొండలు యాత్రకు టికెట్ల కోసం aptdc.in ద్వారా ఆన్‌లైన్‌లో  టికెట్లు బుక్‌ చేసుకోవాలి. నేరుగా టికెట్లు కొనాలంటే వివిధ ప్రాంతాల్లో ఏపీటీడీసీ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. పర్యాటకశాఖతో పాటు 11 ప్రైవేట్ బోట్లకు అనుమతులిచ్చారు.

 సొంత వాహనాలు లేని సందర్శకులు రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ఉదయం 6.30కు చేరుకోవాలి. పర్యాటకులను అక్కడినుంచి గండిపోచమ్మ బోటింగ్‌ పాయింట్‌ వరకు వాహనంలో తీసుకెళ్తారు. యాత్ర అక్కడినుంచే మొదలవుతుంది

 2019 సెప్టెంబర్ 15న రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద మునిగిపోయింది. ఈ ఘటనలో బోటులో ప్రయాణీస్తున్న 39 మంది మరణించారు. 26 మందిని స్థానికులు కాపాడారు.  అక్టోబర్ 22న ధర్మాడి సత్యం బృందం ఈ బోటును  గోదావరి నుండి బయటకు తీసింది.ఈ బోటు మునిగిన తర్వాత గోదావరి నదిలో పాపికొండల పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 

 పాపికొండల విహారయాత్ర పర్యవేక్షణకు ఐదు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పర్యాటక బోట్లకు ఎస్కార్ట్ బోట్ తప్పని సరిచేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా నడిచే బోట్లకు కళ్ళెం పడింది. రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి గల కారణాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుజాగ్రత్తలు తీసుకొంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా అనుమతి లేకుండా బోట్లను అనుమతించడం లేదు, అంతేకాదు బోట్లను తనిఖీ చేసిన తర్వాతే  నదిలోకి అనుమతి ఇవ్వనున్నారు. శనివారం నాడు పాపికొండల టూర్ ట్రయల్ రన్ నిర్వహించారు.

 

click me!