అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. ఈ తేదీల్లో అతి భారీ వర్షాలు..

By team teluguFirst Published Nov 7, 2021, 11:12 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (heavy rains) పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. అయితే నవంబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (heavy rains) పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. అయితే నవంబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో.. ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు అక్కడ వర్షాలు కురువనున్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం కురిసిన వర్షాలు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు  25వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడులోని అనేక జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక, దక్షిణ తమిళనాడు, డెల్టాజిల్లాల్లో మరో ఐదురోజులపాటూ ఉరుములు, పిడుగుపాటుతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది.

Also read: తాడిపత్రి: 20మంది కూలీలతో వెళుతుండగా యాక్సిడెంట్... ఒకరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

ఏపీలో వర్షాలు..
ఈ నెల 9వ తేదీన ఏర్పడే అల్పపీడనం.. క్రమేపి బలపడి వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఈ నెల 10,11,12 తేదీల్లో సముద్రం అల్లోకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. 

Also read: YS Vivekananda Reddy Murder case ...ఆ రోజు ఉమాశంకర్ రెడ్డి రోడ్డుపై పరుగెత్తారు: సీబీఐ

ఇక, నెల్లూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షల కారణంగా పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

click me!