టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎదురుదెబ్బ

By telugu teamFirst Published Apr 5, 2021, 12:47 PM IST
Highlights

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు ఎదురు దెబ్బ తగిలిది. చాగలమర్రికి చెందిన స్థానిక నాయకులు వైసీపీలో చేరారు.

కర్నూలు: మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎదురు దెబ్బ తగిలింది. జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివిరెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్ వలీ టీడీపీని వీడి వైఎస్సాఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. 

రామగురివిరెడ్డి దశాబ్దాలుగా భూమా వర్గంలో కొనసాగుతూ చాగలమర్రిలో భూమా వర్గానికి బాసటగా నిలుస్తూ వస్తున్నారు. వారితో పాటు వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి, బికారి సాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లా బకాష్, పద్మకూమార్ రెడ్డి తదితర భూమా వర్గానికి చెందినవారు వైసీపీలో చేరారు. 

ఆదివారం ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్ెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్మంలో వైసీపీ నాయకులు చిన్నవంగలి లక్ష్మీరెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, కొండా రెడ్డి, చాగలమర్రి మండల నాయకులు బాబూలాల్, కుమార్ రెడ్డి, రమణ, రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో భూమా వర్గం ఓటమి పాలైంది. తాజా ఫిరాయింపులతో చాగలమర్రిలో భూమా వర్గం మరింతగా బలహీనపడింది. 

ముఖ్యమంత్రి వైఎస్ జనగ్ పార్టీలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, జగన్ పాలనాదక్షతకు ఆకర్షితుడనై వైసీపీలో చేరానని రామగురివిరెడ్డి చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, స్థానికంగా తమ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నవారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. 

click me!