కరెంట్ షాక్... తెగిపడిన చిన్నారి చెయ్యి..!

Published : Apr 05, 2021, 09:59 AM ISTUpdated : Apr 05, 2021, 10:05 AM IST
కరెంట్ షాక్... తెగిపడిన చిన్నారి చెయ్యి..!

సారాంశం

ప్రతీ రోజూ చెత్తను, ఇతర వస్తువులను, కూరగాయలను బకెట్‌లో పెట్టి పైకి, కిందికి తీసుకుని వస్తుంటారు. ఈక్రమంలో ఆ బకెట్‌కు పాత విద్యుత్‌ వైరును కట్టి ఉంచారు.

విద్యుదాఘాతానికి ఇద్దరు తల్లీ కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చిన్నారి చెయ్యి తెగి పడిపోవడం గమనార్హం. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అక్కాయపల్లిలోని సొంత ఇంటిలోని రెండో అంతస్తులో  నివాసం ఉంటున్న షేక్‌ ఆరిపుల్లా, భార్య ఫరీదాలకు ముగ్గురు కుమార్తెలు. ఆరిపుల్లా ప్రస్తుతం కువైట్‌లో ఉన్నాడు. ప్రతీ రోజూ చెత్తను, ఇతర వస్తువులను, కూరగాయలను బకెట్‌లో పెట్టి పైకి, కిందికి తీసుకుని వస్తుంటారు. ఈక్రమంలో ఆ బకెట్‌కు పాత విద్యుత్‌ వైరును కట్టి ఉంచారు.

ఈనెల 3వ తేదీ రాత్రి మూడో కుమార్తె అయేషా(12) చెత్తబుట్టను కిందకు వేసింది. బకెట్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో షాక్‌కు గురైంది. ఈక్రమంలోనే స్టీల్‌ పైపునకు చేయి తగలడం, తెగిపడటం క్షణాల్లో జరిగిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే తల్లి ఫరీదా(37) కుమార్తెను పట్టుకోవడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రజల సాయంతో విద్యుత్‌ సరఫరా ఆపించారు. గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్సకోసం క్రిస్టియన్‌లేన్‌లోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu