పొత్తులు, సీఎం అభ్యర్ధిపై ఇప్పుడే ప్రస్తావన అవసరం లేదని బీజేపీ ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ట్రాప్ లో పడొద్దని ఆయన పవన్ కళ్యాణ్ ను కోరారు.
అమరావతి: పొత్తులు, సీఎం అభ్యర్ధిపై ఇప్పుడే ప్రస్తావన అనవసరం BJP జాతీయ కార్యదర్శి Satya Kumarఅభిప్రాయపడ్డారు.సోమవారం నాడు ఆయన Vijayawada లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు YCP పొత్తుల గురించి చర్చ పెడుతుందన్నారు. వైసీపీ మైండ్ గేమ్ లో పడొద్దని తాను Pawan Kalyan కు సూచిస్తున్నట్టుగా సత్యకుమార్ చెప్పారు. CM అభ్యర్ధి ఎవరో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడు చర్చ అనవసరమన్నారు. గతంలో వైసీపీ ట్రాప్ లో Cnahdrababu పడ్డారన్నారు. ఇప్పుడు వైసీపీ ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడొద్దని తాను కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మైండ్ గేమ్ ఆడడంలో వైసీపీ నేతలు సిద్దహస్తులని ఆయన చెప్పారు. గతంలో కోడికత్తి కేసు ఘటనను ఆయన ప్రస్తావించారు. వైసీపీ మైండ్ గేమ్ లను తాము రాష్ట్రంలో చూశామన్నారు. పాలన చేయాలని వైసీపీకి అధికారం ఇస్తే దాన్ని వదిలేసి పొత్తులపై పార్టీల మధ్య చర్చతో పబ్బం గడుపుకొనేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని సత్యకుమార్ విమర్శించారు.సంక్షేమం, అభివృద్దిని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు.
పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందేనన్నారు. ఎన్నికల సమయంలోనే సీఎం అభ్యర్ధులను తమ పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. బీజేపీకి చెందిన అభ్యర్ధులనే సీఎం అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించే సంప్రదాయం ఉందన్నారు. కానీ ఎన్నికలు లేని సమయంలో పొత్తులు, సీఎం అభ్యర్ధిపై ప్రకటన ఎలా చేస్తారని సత్యకుమార్ ప్రశ్నించారు. సీఎం అభ్యర్ధి ప్రకటనపై బీజేపీ కేంద్ర నాయకత్వంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుకోవాలని సత్యకుమార్ సూచించారు.
బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని జనసేన డిమాండ్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసే ముందు మూడు ఆఫ్షన్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం, జనసేన ఒంటరిగా పోటీ చేసే ఆఫ్షన్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ, జనసేనలు కలిసి పనిచేస్తున్నాయని కమలనాథులు ప్రకటించారు
also read:ఆయుష్మాన్ భారత్‌ను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీగా మార్చింది.. ఏపీకి బీజేపీ అవసరం ఉంది: జేపీ నడ్డా
. అయితే ఏపీకి జనసేన , బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్న తరుణంలో జనసేన నుండి ఈ డిమాండ్ రావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో బీజేపీ కూడా స్పష్టత ఇచ్చింది. ఎన్నికలు లేని సమయంలో ఈ చర్చ అనవసరమని తేల్చి చప్పింది. బీజేపీయేతర అభ్యర్ధిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించే సంపరదాయం తమ పార్టీలో లేనేలేదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలోనే సీఎం అభ్యర్ధులను తమ పార్టీ ప్రకటిస్తుందని బీజేపీ నేత సత్యకుమార్ ఇవాళ విజయవాడలో తేల్చిచెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని తాను ప్రయత్నిస్తానని చెప్పారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడదని కూడా ఆయన గతంలోనే నొక్కి చెప్పారు.చంద్రబాబును సీఎం చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.