ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగించింది కోర్టు. సోమవారం నాడు ఆన్ లైన్ లో జడ్జి ముందు పోలీసులు ఎమ్మెల్సీని ప్రవేశ పెట్టారు. దీంతో ఎమ్మెల్సీకి రిమాండ్ ను పొడిగించారు. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు.
అమరావతి: ఎమ్మెల్సీ Ananthababu కు రిమాండ్ ను పొడిగించింది Court. సోమవారం నాడు ఆన్ లైన్ లో Judge ముందు పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును ప్రవేశ పెట్టారు.ఈ నెల 20వ తేదీ వరకు అనంతబాబుకు రిమాండ్ ను పొడిగించింది కోర్టు.
MLC అనంతబాబు తన వద్ద పనిచేసిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఈ ఏడాది మే 23న అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్సీకి కోర్టు 14 రోజుల పాటు Remand విధించారు. అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీ తీసుకొనేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. రిమాండ్ గడువు పూర్తి కావడంతో ఇవాళ మరోసారి ఆన్ లైన్ లో జడ్జి ముందు పోలీసులు ఎమ్మెల్సీని ప్రవేశ పెట్టారు.ఈ నెల 20వ తేదీ వరకు ఎమ్మెల్సీకి రిమాండ్ ను పొడిగించారు జడ్జి.
also read:రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్.. కస్టడీ పిటిషన్ దాఖలు చేయని పోలీసులు..
సుబ్రమణ్యం హత్య కేసులో దళిత సం:ఘాలు విపక్షాలు గతంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టైన తర్వాత ఆయనను YCP నుండి సస్పెండ్ చేశారు.
ఈ ఏడాది మే 20వ తేదీన ఉదయం డ్రైవర సుబ్రమణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో సుబ్రమణ్యం డెడ్ బాడీని తీసుకొచ్చాడు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని కుటుంబసభ్యులకు చెప్పాడు. డెడ్ బాడీని కారు నుండి బయటకు తీయాలని చెప్పాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుబ్రమణ్యం మరణానికి సంబంధించి కారణాలు చెప్పాలని కోరుదూ కుటుంబ సబ్యులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డు పడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వపరంగా అనంతబాబు కుటుంబానికి సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఆ తర్వాతే సుబ్రమణ్యం డెడ్ బాడీకి కుటుంబ సభ్యులు అంగీకరించారు. పోస్టుమార్టం నివేదికలో హత్యేనని తేలింది. మృతుడి ఒంటిపై గాయాలున్నట్టుగా వైద్యులు నిర్ధారించారు.
ఉద్దేశ్యపూర్వకంగా సుబ్రమణ్యాన్ని హత్య చేయలేదని ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల విచారణలో తెలిపారని కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు గత నెల 23న ప్రకటించారు. పద్దతి మార్చుకోవాలని కొట్టడంతో ఇంటి వద్ద ఉన్న గేటకు తగిలి డ్రైవర్ సుబ్రమణ్యానికి గాయాలయ్యాయన్నారు. ఈ సమయంలో తనపై దాడికి యత్నించడంతో సుబ్రమణ్యాన్ని నెట్టివేయడంతో కొందపడ్డాడని చెప్పారని ఎస్పీ వివరించారు. ఆసుపత్రికి తరలించే సమయంలోనే సుబ్రమణ్యం మరణించాడని ఎమ్మెల్సీ తమకు చెప్పాడని ఎస్పీ చెప్పారు. అయితే సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా చిత్రీకరించేందుకు గాను డంప్ యార్డ్ ప్రాంతానికి తీసుకెళ్లి కర్రతో కొట్టినట్టుగా ఎస్పీ చెప్పారు.ఎమ్మెల్సీ అనంతాబుకు బెయిల్ కోరుతూ లాయర్లు ఈ నెల 1వ తేదీన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 7న విచారణకు రానుంది