రాజ్‌భవన్ లో గవర్నర్‌తో జగన్ భేటీ: పలు అంశాలపై చర్చ

Published : Jun 06, 2022, 06:29 PM ISTUpdated : Jun 06, 2022, 07:17 PM IST
 రాజ్‌భవన్ లో గవర్నర్‌తో జగన్ భేటీ: పలు అంశాలపై చర్చ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు సోమవారం నాడు సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan దంపతులు సోమవారం నాడు సాయంత్రం రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ Biswabhusan Harichandan తో భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాదపూర్వకమైందేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Davos టూర్ నుండి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలు. పారిశ్రామికవేత్తలతో భేటీ విషయాలను గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి  త్వరలోనే నోటిఫికేషన్ జార చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో ఎన్డీఏకు YCP మద్దతును ప్రకటించింది. ఆ సమయంలో ఎన్డీఏలో TDP  ఉంది.థావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన రెండు రోజులకే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సమస్యల.పై ప్రధాని  Narendra Modi కి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర షెకావత్, అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల విషయమై కూడా ప్రధాని మోడీతో పాటు అమిత్ షాలతో జగన్ చర్చించినట్టుగా ప్రచారం సాగింది. 

కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ జిల్లాలో గ్యాస్ లీక్ వంటి అంశాలు కూడా వీరి మద్య చర్చకు వచ్చినట్టుగా సమాచారం. అమరావతిలో టీటీడీ ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా సీఎం జగన్ గవర్నర్ దంపతులను ఆశ్వానించారని తెలిసింది.  వెంకటపాలెంలో రూ. 40 కోట్ల  వ్యయంతో  25 ఎకరాల్లో టీటీడీ దేవాలయాన్ని  నిర్మించింది.

కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ జిల్లాలో గ్యాస్ లీక్ వంటి అంశాలు కూడా వీరి మద్య చర్చకు వచ్చినట్టుగా సమాచారం. అమరావతిలో టీటీడీ ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా సీఎం జగన్ గవర్నర్ దంపతులను ఆశ్వానించారని తెలిసింది.  వెంకటపాలెంలో రూ. 40 కోట్ల  వ్యయంతో  25 ఎకరాల్లో టీటీడీ దేవాలయం నిర్మించింది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో గవర్నర్ బిశ్వభూషణ్ తో జగన్ భేటీ అయ్యారు.ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ విషయమై జగన్ అప్పట్లో గవర్నర్ తో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ , సుప్రవ హరిచందన్ దంపతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు భేటీ అయ్యారు, సోమవారం సాయంత్రం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. గవర్నర్ ను వెంకటేశ్వర స్వామి మెమెంటో, శాలువాతో సత్కరించారు. 

దాదాపు గంట సేపు గవర్నర్, ముఖ్యమంత్రి ఏకాంతంగా సమావేశం అయ్యారు. సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు.  మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశం నేపధ్యంలో రాష్ట్రంలో పెద్దయెత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి సిఎం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు. 

 త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు, ఆ సందర్భంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప‌లు కీల‌క బిల్లుల‌పైనా గ‌వ‌ర్న‌ర్‌తో జ‌గ‌న్ చ‌ర్చించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త , శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్ , విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, ఎన్ టిఆర్ విజయవాడ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, డిసిపి జాషువా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో గవర్నర్ బిశ్వభూషణ్ తో జగన్ భేటీ అయ్యారు.ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ విషయమై జగన్ అప్పట్లో గవర్నర్ తో చర్చించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!