చంద్రబాబు ఢిల్లీ దీక్ష ఎఫెక్ట్: ఏపీ ప్రజలకు అమిత్ షా బహిరంగ లేఖ

By Nagaraju penumalaFirst Published Feb 11, 2019, 6:24 PM IST
Highlights

రాబోయే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతామని తెలిసి చంద్రబాబు నాయుడు ఎన్నో యూటర్న్ లు తీసుకున్నారని లేఖలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుని నమ్మెుద్దు అంటూ లేఖలో కోరారు. ఏపీ అభివృద్ధికి భారతీయ జనతాపార్టీ ఎంతో కృషి చేసిందని స్పష్టం చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని లేఖలో తెలిపారు. 

ఢిల్లీ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు దారుణమైన ఓటమి తప్పదని హెచ్చరించారు. ఏపీ ప్రజలకు అమిత్ షా బహిరంగ లేఖ రాశారు. 

రాబోయే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతామని తెలిసి చంద్రబాబు నాయుడు ఎన్నో యూటర్న్ లు తీసుకున్నారని లేఖలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుని నమ్మెుద్దు అంటూ లేఖలో కోరారు. ఏపీ అభివృద్ధికి భారతీయ జనతాపార్టీ ఎంతో కృషి చేసిందని స్పష్టం చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని లేఖలో తెలిపారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షకు దిగారు. 

చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జాతీయ పార్టీలు భారీ సంఖ్యలో హాజరై మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శరద్ పవార్, గులాం నబీ ఆజాద్ తోపాటు ఇతర జాతీయ పార్టీల నేతలు మోదీపై విరుచుకుపడ్డారు. 

మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. మోదీ మళ్లీ అధికారంలోకి రావడం కల్లేనని ఘాటుగా విమర్శించారు. ఏపీకి మోదీ తీవ్ర అన్యాయం చేశారని నేతలంతా ముక్త కంఠంతో ఆరోపించారు. ఇలాంటి తరుణంలో అమిత్ షా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.  

click me!