యాత్ర సినిమాపై వైఎస్ విజయమ్మ స్పందన ఇదీ....

Published : Feb 11, 2019, 06:03 PM ISTUpdated : Feb 11, 2019, 06:08 PM IST
యాత్ర సినిమాపై  వైఎస్ విజయమ్మ స్పందన ఇదీ....

సారాంశం

సోమవారం హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసిన ఆమె యాత్ర సినిమాను చాలా బాగా తీశారని కొనియడారు. కోట్లాది మంది హృదయాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను యాత్ర సినిమా ద్వారా దర్శకనిర్మాతలు తట్టి లేపారని చెప్పుకొచ్చారు.   

హైదరాబాద్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం ఎంతో బాగుందని ఆయన సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యాత్ర చిత్ర యూనిట్‌ను విజయమ్మ అభినందించారు. 

సోమవారం హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసిన ఆమె యాత్ర సినిమాను చాలా బాగా తీశారని కొనియడారు. కోట్లాది మంది హృదయాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను యాత్ర సినిమా ద్వారా దర్శకనిర్మాతలు తట్టి లేపారని చెప్పుకొచ్చారు. 

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సజీవంగా మనముందు లేకపోయినా యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వైఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారని గుర్తు చేశారు. 

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టుబడేవారని స్పష్టం చేశారు. యాత్ర చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కడమే కాకుండా బాక్స్ ఆఫీస్‌ వద్ద కలెక్షన్లు రాబట్టడం సంతోషకరమన్నారు. అంతకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా యాత్ర టీమ్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu