ఏపీకి ప్రత్యేక హోదా: బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Feb 13, 2022, 1:19 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండానే నిధులు ఇస్తున్నామన్నారు.


విశాఖపట్టణం: ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు.ఆదివారం నాడు ఆయన విశాఖపట్టణంలో  GVL Narasimha Rao మీడియాతో మాట్లాడారు. అనవసరంగా Specail status అంశాన్ని Telangana విబేధాలతో ముడిపెట్టొద్దని జీవీఎల్ నరసింహారావు సూచించారు. ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదని ఆయన తేల్చి చెప్పారు.Congress, TDP, YCP వల్లే ఏపీ నష్టపోయింని ఆయన చెప్పారు.కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ది జరుగుతుందన్నారు.అదనపు నిధులు రావాలని Andhra Pradesh కోరుకోవడంలో తప్పులేదని జీవీఎల్ వివరించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయానికి, ఖర్చులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున కేంద్రం ప్రత్యేకంగా ఏపీకి నిధులు ఇస్తుందన్నారు. కానీ ఇతర రాష్ట్రాలకే ఈ తరహలో నిధులను ఇవ్వడం లేదని జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదన్నారు. రెవిన్యూ డిఫిసిట్ గ్రాంట్ కింద నిధులు లభిస్తున్నాయని  జీవీఎల్ వివరించారు. తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ గ్రాంట్ కింద నిధులు రావడం లేదన్నారు.  ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వడం లేదని చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు.

Latest Videos

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలకు సంబంధించి ఓ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17న ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. 

ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి శనివారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ  త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ  నిర్వహించనున్నారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ లతో కమిటి ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్‌ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.
 

click me!