ఏపీలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. స్టేజ్ 2 దరఖాస్తు ఎప్పటినుంచంటే..?

By Sumanth KanukulaFirst Published Feb 5, 2023, 11:36 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలను ఏపీ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టుగా తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలను ఏపీ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో (https://slprb.ap.gov.in/) అందుబాటులో ఉంచినట్టుగా తెలిపింది. ఫైనల్ కీని వెబ్‌సైటులో అందుబాటులో ఉంచినట్టుగా పేర్కొంది. స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్‌లు ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడు చేసుకోవడానికి అందుబాటులో ఉంచనున్నట్టుగా తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యేందుకు స్టేజ్ 2 దరఖాస్తును వెబెసైట్‌ను సందర్శించి పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్టేజ్‌ 2 దరఖాస్తు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అభ్యర్థులు తదుపరి అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. అభ్యర్థులు ఏదైనా స్పష్టత కోసం.. హెల్ప్‌లైన్ నంబర్: 9441450639, 9100203323కు కాల్ చేయవచ్చని తెలిపింది. అలాగే mail-slprb@ap.gov.inకి మెయిల్ పంపవచ్చని సూచించింది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని 35 ప్రాంతాల్లో 997 కేంద్రాలలో జనవరి 22న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించినట్టుగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా పేర్కొంది. పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయడం జరిగిందని తెలిపింది. పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయడం జరిగిందని గుర్తుచేసింది. 2261 అభ్యంతరాలు వచ్చాయి.. సబ్జెక్ట్ నిపుణులు ప్రతి అభ్యంతరాలను ధృవీకరించారని తెలిపింది. 3 ప్రశ్నలకు సమాధానాలు మార్చబడ్డాయని.. తుది జవాబు కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పేర్కొంది.
 

click me!