కేంద్రనిధులతో విమానాలు స్టార్ హోటళ్లలో చంద్రబాబు, లోకేష్: జీవీఎల్ ఫైర్

By Nagaraju TFirst Published Jan 29, 2019, 9:05 PM IST
Highlights

మాణిక్యారావు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని చెప్పుకొచ్చారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. 
 
తాడేపల్లిగూడెం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు, తనయుడు లోకేష్ లు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని జీవీఎల్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావును పరామర్శించారు. 

మాణిక్యారావు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని చెప్పుకొచ్చారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. 

కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. దొంగ దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓఆర్‌పీ అంటే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ అనేది బీజేపీ నినాదమైతే కాంగ్రెస్‌ వాళ్లకు మాత్రం ఓన్లీ రాహుల్‌-ఓన్లీ ప్రియాంక అంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు.

click me!