ఏపీ శాసన మండలి రద్దుపై బిజెపి ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

Published : Jan 29, 2020, 01:31 PM IST
ఏపీ శాసన మండలి రద్దుపై బిజెపి ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ శాసన మండలి రద్దిుపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి రద్దుపై పార్లమెంటు అభ్యంతరాలు చెప్పడానికి అవకాశాలు లేవని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై బిజెపి పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి రద్దుపై పార్లమెంటులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ ఉండకపోవచ్చునని ఆయన అన్నారు.

శాసనస మండలి రద్దు విషయంలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సూచనలు మాత్రమే చేస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే.

Also Read: ఢీల్లీకి తీర్మానం:ఇక ఏపీ శాసనమండలి రద్దు కేంద్రం చేతుల్లోనే

కేంద్రం అమోదిస్తే శాసన మండలి రద్దవుతుంది. అయితే, శాసన మండలి రద్దుకు రాజ్యాంగబద్దంగా అడ్డంకులు కల్పించే అవకాశాలు ఏవీ లేవు. అయితే, జాప్యం చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది.

జీవీఎల్ నరసింహారావు చేసిన తాజా వ్యాఖ్య నేపథ్యంలో ఏపీ శాసన మండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చునని అర్థమవుతోంది. శాసన మండలి రద్దు అంత సులభం కాదని, కేంద్రం అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది.

Also Read: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్: ఆ ముగ్గురు ఏం చేశారో తెలుసా? 

PREV
click me!

Recommended Stories

Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu
Dwadasi Chakra Snanam in Tirumala: ద్వాదశి సందర్బంగా తిరుమలలో చక్రస్నానం | Asianet News Telugu