టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. తన వద్ద గొర్రెలకే కాకుండా పిచ్చికుక్కలకు కూడా వైద్యం ఉందని వంశీ అన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతలో గొర్రెల్లా కొన్నారని, గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కూడా కొన్నారని నారా లోకేష్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలు చేస్తూ నారా లోకేష్ వైఎస్ జగన్, వల్లభనేని వంశీ ఫొటోలను జోడించి ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దానిపై వంశీ తీవ్రంగా స్పందించారు. వద్దంటే మంగళగిరి వెళ్లి చిత్తుగా ఓడిపోయావని వంశీ నారా లోకేష్ ను ఉద్దేశించి అన్నారు.
తన వద్ద గొర్రెలకే కాకుండా పిచ్చికుక్కలకు కూడా వైద్యం ఉందని ఆయన అన్నారు. శాసన మండలి రద్దు కావడంతో ఉన్నది కూడా పోయి నారా లోకేష్ కు పిచ్చి పట్టిందని ఆయన అన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తాను సంతలో గొర్రెల్లా ఎలా కొన్నాడో గారు చెబుతున్నారు వినండి. జగన్ గారి మరో ప్రత్యేకత ఏంటంటే గొర్రెలతోపాటు గొర్రెల డాక్టర్‌నీ కొన్నారు. pic.twitter.com/g3EesVfCAk
— Lokesh Nara (@naralokesh)