ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం టెలిస్కోప్ తో చూస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. తాము తలపెట్టిన ప్రజాగ్రహ సభతో టీడీపీ, వైసీపీలకు భయం పట్టుకుందన్నారు. ఇవాళ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు
అమరావతి:ఏపీలోని పరిస్థితులను కేంద్రం టెలిస్కోప్ తో చూస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.మంగళవారం నాడు బీజేపీ ఎంపీ CM Ramesh అమరావతిలో మీడియాతో మాట్లాడారు. Ycp లో అంతర్గత పోరు ఉందన్నారు.Tdp ప్రతిపక్షంగా ఫెయిలైందని ఆయన చెప్పారు. ఏపీలో పనిచేయలేకపోతున్నామని చాలామంది అధికారులు తనకు ఫోన్ చేశారన్నారు. కేంద్రం జోక్యం చేసుకొంటేనే మంచిదని ఏపీ అధికారులు చెబుతున్నారన్నారు. వైసీపీ తప్పును ప్రజాగ్రహ సభలో ప్రజలకు పార్టీ అగ్రనేతలు వివరిస్తారని చెప్పారు.
also read:బీజేపీని సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు లీజు: మంత్రి పేర్ని నాని ఫైర్
undefined
బీజేపీ ఇవాళ ప్రజాగ్రహ సభను పెట్టడంపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఏపీ రాష్ట్రంలో ప్రలజకు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడంపైనే అక్కసుతోనే ఈ సభను నిర్వహిస్తున్నారా అని మంత్రి నాని ప్రశ్నించారు. టీడీపీ ఎజెండానే బీజేపీ రాష్ట్రంలో అమలు చేస్తోందన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు బీజేపీని లీజుకు ఇచ్చారన్నారు.
. నూతన వ్యవసాయ చట్టాలను మరోసారి తీసుకువస్తామని కూడా కేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఇవాళ రాష్ట్రంలో నిర్వహించే ప్రజాగ్రహ సభలో తాను లేవనెత్తిన అంశాలపై మాట్లాడాలని మంత్రి పేర్ని నాని బీజేపీ నేతలను కోరారు. ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదన్నారు.జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు జట్టు కడుతాయి.. కానీ ఏపీలో మాత్రం టీడీపీ కూటమిలో బీజేపీ ఉందని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ చెప్పించలేదా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని బీజేపీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.
బ్రాందీ ధరలు పెరిగినందుకు కాదు డీజీల్, పెట్రోల్ ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలు బాధపడాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు.ఎరువుల ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలకు ఎందుకు బాధ లేదని మంత్రి ప్రశ్నించారు. 2014 లో ఎరువుల బస్తా రూ.800 లనుండి ప్రస్తుతం రూ.1700లకు చేరుకొందన్నారు
ఇదిలా ఉంటే బీజేపీ ప్రజాగ్రహ సభపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా గ్రహ సభపై Payyavula Keshav సెటైర్లు వేశారు. జగన్ అనుగ్రహ సభ అంటూ ఈ సభపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతి రైతులకు మద్దతివ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి Amit shah చెబితేనే రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏపీకి చెందిన బీజేపీ నేతలు ఇవాళ ప్రజాగ్రహ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాష్ జవదేకర్ సహా పలువురు బీజేపీ అగ్ర నేతలు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ నేతలు ప్రసంగించనున్నారు.