కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుంది.. పోలవరానికి బాబుకి సంబంధం లేదు: సోము

First Published 14, Jul 2018, 12:39 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కడపలో కేంద్రప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తుందని... అది టీడీపీ దీక్షలకు భయపడి కాదన్నారు. నిన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగిన పోర్ట్ సమావేశంలో ఎక్కడా ప్రధాని మోడీ ఫోటో పెట్టలేదని.. అందువల్లే బీజేపీ కార్యకర్తలు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారని చెప్పారు..

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు వస్తున్నా.. ఏమీ రావడం లేదంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నానరని సోము మండిపడ్డారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ప్రధానికి వ్యతిరేకంగా అధికారిక సమావేశంలో మాట్లాడటం సరికాదన్నారు.. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు పోలవరం ప్రాజెక్ట్‌ గురించి పట్టించుకోలేదని వీర్రాజు మండిపడ్డారు..

ప్రాజెక్ట్‌ను చేయలేననే పుష్కరణి.. తాటిపూడి ఎత్తిపోతల పథకం అమలు చేశారని ఆరోపించారు.. పోలవరం ప్రాజెక్ట్‌తో చంద్రబాబుకు అవగింజంత సంబంధం లేదని ఎద్దేవా చేశారు. విభజన సమయంలో పోలవరం గురించి మాట్లాడింది... ముంపు గ్రామాలను బీజేపీలో కలిపింది బీజేపీయేనని.. కానీ చంద్రబాబు మాత్రం అన్ని తానే చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 

Last Updated 14, Jul 2018, 12:39 PM IST