మేనత్తతో అక్రమ సంబంధం: మామ చేతిలో హతం

Published : Jul 14, 2018, 11:15 AM IST
మేనత్తతో అక్రమ సంబంధం: మామ చేతిలో హతం

సారాంశం

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి తన మేనల్లుడిని హత్య చేశాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది.

విజయవాడ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి తన మేనల్లుడిని హత్య చేశాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లికి చెందిన దేవరపల్లి పాల్‌ యంగ్‌షో(23)ను పామర్రులో చంపేశాడు. 

ఆ తర్వాత మండవల్లి మండలం లింగాల వద్ద పోల్‌రాజ్‌ కెనాల్‌లో శవాన్ని పడవేసినట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు. ఈ నెల 10వ తేదీన పాల్‌ యంగ్‌షో ఉయ్యూరులో బైక్‌ ఫైనాన్స్‌ కట్టేందుకు వెళ్లాడు.

 తిరిగి ఇంటికి  రాలేదు. దీంతో చుట్టుపక్కల గాలించి, ఆచూకి తెలియలేదని మృతుడి తండ్రి చింతయ్య తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి కోసం గాలిస్తుండగా పామర్రులో ఉంటున్న మృతుడి మేనమామ నరసింహారావు ఇంటికి వెళ్లినట్లుగా గుర్తించారు. 

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో పాల్‌ యంగ్‌షోను నరసింహారావు చంపి లింగాల గ్రామంలోని పోల్‌రాజ్‌ కెనాల్‌లో పడవేసినట్లు ఎస్సై తెలిపారు. చింతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu