చంద్రబాబు అవినీతి చక్రవర్తి, శివాజీ హీరో కాదు జీరో: సోము

By Nagaraju TFirst Published Oct 27, 2018, 3:11 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ ఘాటుగా విమర్శించారు. విశాఖపట్నం జిల్లాలోని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాలో పాల్గొన్న సోము వీర్రాజు 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. 
 

విశాఖపట్నం:  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ ఘాటుగా విమర్శించారు. విశాఖపట్నం జిల్లాలోని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాలో పాల్గొన్న సోము వీర్రాజు 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. 

అగ్రిగోల్డ్‌ ఆస్తి విలువ పెరుగుతున్నప్పుడు బాధితులకు ఇవ్వాల్సిన బకాయిలు విలువ ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. 2019లో టీడీపీకి అగ్రిగోల్డ్ బాధితుల శాపం తప్పకుండా తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. అవినీతికి అద్దం పట్టే పార్టీ టీడీపీ అని సొంతమామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

సీఎం చంద్రబాబు అబద్దాల ఉగ్గుపాలు తాగి పెరిగాడని విమర్శించారు. పొట్ట విప్పితే అవినీతి, అబద్దాలు తప్ప ఇంకేమీ ఉండవన్నారు.  మరోవైపు జగన్ దాడి విషయంలో
గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేస్తే తప్పేంటని నిలదీశారు. గవర్నర్ డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించడం చూస్తుంటే ఆయననకు బ్యాలెన్స్‌ తప్పినట్లుందన్నారు 

అయితే ప్రజాధనాన్ని దోచుకునే విషయంలో చంద్రబాబు బ్యాలెన్స్‌ తప్పడని ఎద్దేవా చేశారు. ప్రధాని సొంతింటి కలను చంద్రబాబు అద్దింటి కలగా మార్చేశాడంటూ ఆరోపించారు. ఏపీలో డిపాజిట్లు పోయే పార్టీగా, సింగిల్‌ డిజిట్‌ పార్టీగా చంద్రబాబును అంతమొందించాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశభక్తిని ప్రేరేపించే పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. శివాజీ హీరో కాదని జీరో అంటూ మండిపడ్డారు. శివాజీ మాటలను నమ్మే స్థితికి చంద్రబాబాు దిగజారాడు అంటూ సోము విమర్శించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం, రాజప్ప రాజీనామా చెయ్యాలి, శివాజీని అరెస్ట్ చెయ్యాలి: మాణిక్యాల రావు డిమాండ్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

click me!