రాజుగారు కూడా ‘సిట్’ కు ఆధారాలను అందించారు

Published : Jul 22, 2017, 04:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రాజుగారు కూడా ‘సిట్’ కు ఆధారాలను అందించారు

సారాంశం

కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ముందు శనివారం హాజరైన రాజుగారు ఫిర్యాదుతో పాటు తన వద్దున్న ఆధారాలను కూడా అందచేసారు. రికార్డుల ట్యాంపరింగ్‌, భూఆక్రమణలు, భూకబ్జాలపై ఆయన సిట్‌కు ఫిర్యాదు కూడా ఇచ్చారు.  మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా సిట్ ముందు హాజరై ఫిర్యాదులతో పాటు భూకబ్జా, రికార్డుల ట్యాంపరింగ్ తదితరాలపై ఆధారాలు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా?

విశాఖపట్నం జిల్లా భూ కుంభకోణంలో మిత్రపక్షం ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు కూడా ఫిర్యాదులు చేసారు. కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ముందు శనివారం హాజరైన రాజుగారు ఫిర్యాదుతో పాటు తన వద్దున్న ఆధారాలను కూడా అందచేసారు. రికార్డుల ట్యాంపరింగ్‌, భూఆక్రమణలు, భూకబ్జాలపై ఆయన సిట్‌కు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ముదపాక భూములు, చిట్టివలసలో 41 ఎకరాలు, పాయకారావుపేట నియోజకవర్గంలోని రాజవరంలో 144 ఎకరాలు, మాధవధారలోని 2 ఎకరాల కబ్జా తదితరాలపై విష్ణుకుమార్‌ సిట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మొన్నటికిమొన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా సిట్ ముందు హాజరై ఫిర్యాదులతో పాటు భూకబ్జా, రికార్డుల ట్యాంపరింగ్ తదితరాలపై ఆధారాలు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా? ఇంకెంతమంది హాజరై కుంభకోణానికి సంబంధించి ఆధారాలను అందచేస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్