కేంద్రం దృష్టిలో భూ కుంభకోణం

Published : Jun 16, 2017, 05:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కేంద్రం దృష్టిలో భూ కుంభకోణం

సారాంశం

భూకుంభకోణం పై  సిట్ కాదు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని డిమాండ్ చేసారు.  కుంభకోణంపై బహిరంగ విచారణ ఉంటుందని భావించానన్నారు. చనిపోయిన వారి పేరుపైన కూడా భూములు  రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పటం గమనార్హం. సిట్ విచారణ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదన్నారు.

విశాఖపట్నం జిల్లాలో జరిగిన భారీ భూకుంభకోణంపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించిందట. భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. భారీ భూకుంభకోణం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. జిల్లాలోని పలుచోట్ల పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరగటంతో పాటు భూ రికార్డుల ట్యాంపరింగ్ కూడా జరిగిందన్నారు. భాజపా ఎంఎల్ఏ హోదాలోనే తాను మాట్లాడుతున్నట్లు కూడా రాజు గారు చెప్పటం గమనార్హం.

రాజుగారు ఈమాట ఎందుకు చెప్పారంటే భూకుంభకోణంపై విష్ణు తప్ప ఇంకెవరూ మద్దతుగా నిలవలేదు ఇంత వరకూ. విశాఖపట్నం ఎంపి, రాష్ట్ర అధ్యక్షుడైన కంభంపాటి హరిబాబు అయితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విష్ణును హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్న హరిబాబు కానీ పార్టీ నేతలు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకనే తాను భాజపా తరపునే మాట్లాడుతున్నానంటూ చెప్పుకోవాల్సి వచ్చింది.

భూకుంభకోణంపై తాను ఆరు నెలల క్రిందట తాను చెప్పినపుడే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇపుడు ఈ పరిస్ధితి దాపురించిందని వ్యాఖ్యానించారు. ల్యాండ్ పూలింగ్ విధానంలోనే పెద్దకుంభకోణం దాగుందన్నారు.  విశాఖ భూకుంభకోణం పై  సిట్ కాదు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని డిమాండ్ చేసారు.  

కుంభకోణంపై బహిరంగ విచారణ ఉంటుందని భావించానన్నారు. చనిపోయిన వారి పేరుపైన కూడా భూములు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పటం గమనార్హం. సిట్ విచారణ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదన్నారు. సిట్ పై ప్రజలకు అసలు నమ్మకమే లేదన్న రాజు త్వరలో మరో భారీ కుంభకోణాన్ని బైట పెడతానంటూ పెద్ద బాంబునే పేల్చారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu