సీఎం జగన్ తీరుతో ఏపీకి, తిరుపతికి చెడ్డ పేరు.. : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

Published : Jul 30, 2022, 03:29 PM IST
సీఎం జగన్ తీరుతో ఏపీకి, తిరుపతికి చెడ్డ పేరు.. : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణలోని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. బాయ్ కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతుందని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణలోని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. బాయ్ కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతుందని అన్నారు. అలిపిరి వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు. తిరుపతిలో శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని అన్నారు. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయికాట్ తిరుపతి అనేది వైరల్ అవుతుందని చెప్పారు. 

జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణమని రాజా సింగ్ ఆరోపించారు. సీఎం జగన్ ఏ దేవుడిని నమ్ముతాడో దేశ ప్రజలు అందరికి తెలుసుని రాజా సింగ్ అన్నారు. జగన్ తీరుతో ఆంధ్రప్రదేశ్‌కు, తిరుపతికి చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు. సుప్రీంకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదిని ఉంచడం ద్వారా హిందూ మనోభావాలను నిలబెట్టే చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

గతంలో శ్రీశైలం ఆలయంకు సంబంధించి కూడా రాజాసింగ్.. ఏపీ ప్రభుత్వ తీరును పట్టారు. హిందూయేతర వ్యాపారులు ఆలయ సముదాయంలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో శ్రీశైలం ఆలయ పవిత్రత, దైవత్వం పోయిందని ఆరోపించారు. సుప్రీంలో సమర్థవంతమైన న్యాయవాదిని నిమగ్నం చేయడం ద్వారా హిందూ మనోభావాలను నిలబెట్టే చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. 

హిందూయేతర దుకాణాల యజమానులు, వ్యాపారవేత్తలు మాంసం వినియోగానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నారని రాజా సింగ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జిఒ నెం.426 ద్వారా  శ్రీశైలంలో ఇతర మతాలకు చెందిన వ్యాపారవేత్తలను నిషేధించిందని.. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu