జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీకి మూడవ స్థానం... జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్న విజయసాయి

Siva Kodati |  
Published : Jul 30, 2022, 02:24 PM ISTUpdated : Jul 30, 2022, 02:26 PM IST
జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీకి మూడవ స్థానం... జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్న విజయసాయి

సారాంశం

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్‌కు మూడవ స్థానం రావడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రేషన్ పంపిణీలో జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు.   

వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ‘‘ రేషన్ పంపిణీలో జగన్ గారి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ తృతీయస్థానంలో నిలిచింది. రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది. రాష్ట్రంలో పేదలకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే ప్రభుత్వం రేషన్ అందిస్తోంద’’ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అంతకుముందు గురువారం విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. జగన్ (ys jagan) సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఏపీ ఆర్ధిక స్థితిపై (ap financial status) కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం కంటే ఏపీ ఆర్ధిక పరిస్థితే మెరుగ్గా వుందన్న ఆయన 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా వుందని.. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో వుందని తెలిపారు. ఎక్స్‌పోర్ట్స్‌ విషయంలోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించిందని... కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు

Also REad:కేంద్రం కంటే ఏపీనే బెటర్.. అప్పుల చిట్టా విప్పిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. 41 శాతం వాటా ఇస్తున్నామన్న కేంద్రం మాటల్లో వాస్తవం లేదని.. సెస్, సర్ ఛార్జీలను కేంద్రం ఏటా పెంచుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ ఆ ఆదాయం మాత్రం ఇవ్వడం లేదని... రాష్ట్రాల అప్పులపై గురించి కాదని, ముందు తన అప్పుల సంగతి ఏం చెబుతారని ఆయన చురకలు వేశారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే... చంద్రబాబు సీఎంగా వుండగా ఏపీలో 117 శాతం అప్పుటు పెరిగాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయని ఆయన పేర్కొన్నారు. బాబు ప్రభుత్వం ఐదుగురు కోసం పనిచేస్తే.. జగన్ ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?