అమరావతి రైతుల పాదయాత్ర: నెల్లూరులో పాదయాత్రలో పాల్గొననున్న బీజేపీ నేతలు

By narsimha lodeFirst Published Nov 21, 2021, 11:44 AM IST
Highlights

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పాదయాత్రకు బీజేపీ మద్దతు ప్రకటించింది.  ఇవాళ నెల్లూరులో రైతుల పాదయాత్రలో పాల్గొంటారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానినిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదివారం నాడు ప్రకటించింది.ఆదివారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి  బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని 90 శాతం హమీలను బీజేపీ నెరవేర్చిన విషయాన్ని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Amaravati లోనే రాజధాని ఉండాలనేది తమ పార్టీ అభిప్రాయమని Somu Veerraju ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలోనే ఈ విషయమై తమ పార్టీ  తీర్మానం చేసిందన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో తాము పాల్గొని మద్దతిస్తామని వీర్రాజు చెప్పారు.

also read:Somu Veerraju: రైతుల పాదయాత్రకు మద్దతు.. రాజధానిపై బీజేపీ వైఖరి స్పష్టం చేసిన సోము వీర్రాజు

నెల్లూరు జిల్లాలో సాగుతున్న అమరావతి farmers మహా పాదయాత్రలో bjp నేతలు పాల్గొంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టునుండి నెల్లూరు వరకు ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలో ర్యాలీ సాగింది. నెల్లూరు జిల్లా కావలి నుండి బీజేపీ ఎంపీ సీఎం రమేష్  రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్రను ప్రారంభించారు డిసెంబర్ 15న తిరుపతిలో పాదయాత్ర ముగించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జాల్లాల గుండా ఈ యాత్ర సాగనుంది.  45 రోజుల పాటు ఈ యాత్రను రైతులు కొనసాగించనున్నారు.పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. రైతులు కోర్టుకు వెళ్లి అనుమతిని తీసుకొన్నారు. 

 ఇటీవల తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతిపై చర్చించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించలని బీజేపీ నిర్ణయం తీసుకొన్న విషయమై పార్టీ నేతల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలపై చర్చించారు. నేతలకు వ్యక్తిగత అభిప్రాయాలున్నప్పటికీ పార్టీ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని amit shah షా తేల్చి చెప్పారు.అమరావతి రైతుల padayatraకు మద్దతుపై చర్చించారు. రైతుల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగానే  ఇవాళ నెల్లూరు జిల్లాలో రైతుల మహా పాదయాత్రలో  బీజేపీ నేతలు పాల్గొని సంఘీభావం తెలపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎంలు వ్యతిరేకిస్తున్నాయి.విపక్షంలో ఉన్న సమయంలో కూడా అమరావతిలో రాజధానినిని వైసీపీ వ్యతిరేకించలేదని కూడా విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు రోజువారీ విచారణను నిర్వహిస్తుంది. 

click me!