బీజేపీ నుండి ఆహ్వానం: ఏమీ తేల్చని జేసీ దివాకర్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 17, 2019, 1:40 PM IST
Highlights

బీజేపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందని... కానీ, తాను ఏ సమాధానం చెప్పలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.
 

అమరావతి: బీజేపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందని... కానీ, తాను ఏ సమాధానం చెప్పలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  జగన్‌కు భయపడి  పొగడడం లేదు.. జగన్ విధానాలు నచ్చే ఈ మాటలను చెబుతున్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌కు భయపడుతున్నానో... లేదా ఆరు మాసాల తర్వాత చూస్తారని ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు.  

ఢిల్లీ పర్యటనలో జగన్ చాలా హుందాగా వ్యవహరించారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పులివెందుల నుండి వచ్చిన జగన్ ఇలా ఉంటాడనుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబునాయుడు సమీక్షించుకొంటారని జేసీ తేల్చి చెప్పారు.

జగన్ ను ఆకాశంపైకి ఎత్తలేదన్నారు. వాస్తవాన్ని గ్రహించి జగన్ మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు.తాను  జీవితంలో ఎవరికీ భయపడలేదు.. బాబు సీఎంగా ఉన్న కాలంలో  విమర్శించాను... అభివృద్ది చేస్తే  పొగిడినట్టుగా ఆయన చెప్పారు.
 

సంబంధిత వార్తలు

చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి

click me!