జగన్ ని ఆహ్వానించేందుకు కేసీఆర్... ఏపీ మంత్రుల ఘనస్వాగతం

Published : Jun 17, 2019, 01:11 PM IST
జగన్ ని ఆహ్వానించేందుకు కేసీఆర్... ఏపీ మంత్రుల ఘనస్వాగతం

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ కి... ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు.

కేసీఆర్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లనున్నారు.  కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ కార్యక్రమానికి రావలసిందిగా జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. 

అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి గేట్‌ వే హోటల్‌కు వెళతారు. తర్వాత 5 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 7.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 8.25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే