తన 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని, ఈ రోజు నేను దేవుడు ఆలయంలో, అధికారులు, వేదపండితులు మా పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేశారు.
చిత్తూరు : వేదపండితులు, అధికారులు, పార్టీ శ్రేణుల మధ్య కాణిపాకంలో సత్యదేవుడు ముందు బీజేపీ నేత విష్ణు ప్రమాణం చేశారు. తాను ఏ ఆశ్రమం, మఠం వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదు.. అలాగే నేను ఏ రకమైన రాజకీయ అవినీతికి పాల్పడలేదు అంటూ ప్రమాణం చేశారు.
తన 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని, ఈ రోజు నేను దేవుడు ఆలయంలో, అధికారులు, వేదపండితులు మా పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేశారు.
undefined
వీటితో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుకు ప్రమాణం చేయమని ఆహ్వానం పలికాను.నేను నిజాయితీని రుజువు చేసుకోవడానికి కాణిపాకంలో ప్రమాణం చేశాను.
రాచమల్లు మహిళలను అవమాన పరిచి మాట్లాడాడు. రాచమల్లు ఇంట్లోని ఆడబిడ్డలకు నా కుటుంబ సభ్యులుగా బావించి పసుపు కుంకుమ చీర పంపుతాను .
నేను దిగుజారుడు వ్యాఖ్యలు చేయద లుచుకోలేదు. రాచమల్లు కాణిపాకం ప్రమాణానికి రాకుండా పారిపోయినాడు రాజకీయంగా ఎప్పుడూ పసుపు కుంకమను వాడుకోను. బాధ్యత గల వ్యక్తిగా 10 రోజుల్లో ప్రమాణం చేస్తానని చెప్పాను. అందుకే కాణిపాకం వచ్చాను.
ఎమ్మెల్యే రాచమల్లు కు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేక పోవచ్చు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఇకనైనా మంచి బుద్దిని ప్రసాదించాలని స్వామి వారిని కోరుకుంటున్నాను.. అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.