గిన్నీస్ బుక్ రికార్డ్ లో సీఎం రమేష్ దీక్ష

Published : Jul 04, 2018, 02:22 PM IST
గిన్నీస్ బుక్ రికార్డ్ లో సీఎం రమేష్ దీక్ష

సారాంశం

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ సీఎం రమేష్

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన దీక్షపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ వ్యంగాస్త్రాలు  సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరు..కానీ రమేష్ మాత్రం ఏకంగా 11 రోజులు ఆమరణ దీక్ష చేశారు. గ్రేట్ ..ఆయన దీక్షను ‘గిన్నిస్’ కెక్కించాల్సిందే నంటూ సెటైర్లు వేశారు.

 రమేష్ దొంగ దీక్ష వల్ల ప్రజల్లో దీక్షలపై  ఉన్న నమ్మకం సడలిపోయిందని విమర్శించారు. సీఎం రమేష్ పై విమర్శలు సంధించిన విష్ణుకుమార్ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. ఏపీలో హోంగార్డుల కష్టాలు గుర్తించి వారి జీతాలు పెంచినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు