ఎంఎల్సీ పదవికి రాజీనామా..రేపో..ఎల్లుండో ?

Published : Mar 21, 2018, 07:23 AM ISTUpdated : Mar 25, 2018, 05:26 PM IST
ఎంఎల్సీ పదవికి రాజీనామా..రేపో..ఎల్లుండో ?

సారాంశం

టిడిపి మిత్రపక్షంగా ఉన్నపుడు తనకు వచ్చిన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వీర్రాజే మీడియాతో చెప్పారు.

భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు. టిడిపి మిత్రపక్షంగా ఉన్నపుడు తనకు వచ్చిన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వీర్రాజే మీడియాతో చెప్పారు. టిడిపి ద్వారా సంక్రమించిన పదవులు తమకు అవసరం లేదని వీర్రాజు స్పష్టం చేశారు. అలాగే ఇతర నామినేటెడ్ పదవులను కూడా తమ నేతలు రాజీనామాలు చేస్తారని చెప్పారు. నిజానికి పదవుల కోసం బిజెపి నేతలు చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నా  చంద్రబాబునాయుడు వారికి పెద్దగా పదవులు ఇచ్చింది లేదు. అన్నీ ప్రతిపాదనలు పెండింగ్ లోనే ఉంచారు. మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి-బిజెపి విడిపోవటంతోనే అందుకున్న అరోకొరా పదవులకు కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఏపిఎన్ఎంఐడిసి ఛైర్మన్ పదవికి కూడా లక్ష్మీపతి రాజీనామా అందులో భాగమే.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!