జగన్ పాలనలో పెరిగిన అప్పులు: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత పురంధేశ్వరీ ఫైర్

By narsimha lode  |  First Published Mar 13, 2022, 12:24 PM IST

ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పెరిగిపోయాయని బీజేపీ నేత  పురంధేశ్వరీ చెప్పారు. ఆదివారం నాడు బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.


అమరావతి: ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు మరింతగా పెరిగాయని బీజేపీ నేత పురంధేశ్వరీ చెప్పారు.ఆదివారం నాడు  విశాఖలో జరిగిన BJP కార్యకర్తల సమావేశంలో Purandeswari ఆమె ప్రసంగించారు.నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఏపీలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని పురంధేశ్వరీ చెప్పారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా ఆమె పేర్కొన్నారు. ప్రజలక ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వాలు అమలు చేయడం వల్లే ఆయా రాష్ట్రాల్లో కమలం విజయం సాధించిందన్నారు.  ఏపీ రాష్ట్రంలో YCP ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఉన్న అప్పులు ఇవాళ్టికి  మరింత రెట్టింపయ్యాయన్నారు. పుట్టబోయే పిల్లలు కూడా అప్పులు చెల్లించాల్సిన  పరిస్థితులను జగన్ సర్కార్ తీసుకొచ్చిందని పురంధేశ్వరి విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుపై ఉన్న ధ్యాస అభివృద్దిపై లేదన్నారు.కేంద్రం నిధులు ఆపేస్తే ఏపీలో అభివృద్ది సాధ్యమా అని ఆమె ప్రశ్నించారు.

Latest Videos

యూపీలో గెలుపు ఒక నాయకుడితో కాలేదు, కార్యకర్తల సమిష్టి కృషి అని ఆమె చెప్పారు. బీజేపీకి కార్యకర్తలే బలమన్నారు. రాష్ట్రాభివృద్దిపై జగన్ కు చిత్తశుద్ది లేదని ఆమె విమర్శించారు. ఏపీకి ఉన్న అప్పులతో రాష్ట్రంలో పెట్టుబడులు , పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లి పోతున్నాయని ఆమె విమర్శించారు. ఏపీలో రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం ఉందన్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్ది శూనమ్యమని చెప్పారు. 

అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు  మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు.భవిష్యత్‌ బాగుపడాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దని కోరారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు. తక్షణమే జీవో 36ను ప్రభుత్వం రద్దు చేయాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు.

click me!