
యానాం: తూర్పు గోదావరి జిల్లా Yanamలో మోకా Venkateshwar Rao అనే వ్యక్తిని నారాయణస్వామి అనే వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ దృశ్యాలు CCTVల్లో రికార్డయ్యాయి. నిందితుడి నుండి రక్షించుకొనేందుకు వెంకటేశ్వర రావు ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లగానే బాధితుడిని వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టుగా ప్రకటించారు.ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో కూర్చొన్న మోకా వెంకటేశ్వరరావు ను Narayana Swamy కత్తితో పొడిచి పారిపోయాడు.
kajuluru మండలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నారాయణ స్వామి వద్ద వెంకటేశ్వరరావు గతంలో అప్పు తీసుకొన్నారని సమాచారం. ఈ విషయమై వెంకటేశ్వరరావు తో నారాయణస్వామి మాట్లాడేందుకు వచ్చి Knife పొడిచాడు. కుర్చీలో కూర్చొని వెంకటేశ్వరరావుతో మాట్లాడుతూ నారాయణ స్వామి కత్తితో పొడిచినట్టుగా సీసీటీవీల్లో రికార్డైంది. నిందితుడిని వెంకటేశ్వరరావు ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతను అక్కడే నిల్చుండిపోయాడు. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.