సైంధవుడిలా అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు: కన్నా విమర్శలు

Published : Oct 12, 2018, 02:53 PM IST
సైంధవుడిలా అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు: కన్నా విమర్శలు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. సైంధవుడిలా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. 

చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. సైంధవుడిలా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన కన్నా లక్ష్మీనారాయణ నాలుగేళ్లుగా అవినీతిని ఎత్తి చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకే అత్యధిక నిధులు వచ్చాయని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్‌ అడ్డంగా దోచుకుంటున్నారని కన్నా ఆరోపించారు. షుగర్‌ ఫ్యాక్టరీలను చంద్రబాబు అమ్మకానికి పెట్టారన్నారు. పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కన్నా డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Perni Nani Strong Counter To Nara Lokesh | Asianet News Telugu
Weather update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు అలర్ట్