రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి జగన్.. మాయమాటలతో ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారు?: కన్నా లక్ష్మీనారాయణ ఫైర్

By Sumanth KanukulaFirst Published Sep 27, 2022, 1:25 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి  జగన్ అని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి  జగన్ అని ఆరోపించారు. రాష్ట్ర సంపద మొత్తం దోచేయాలన్న ఆలోచన మానుకోవాలని అన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులకు మోసం చేశారని మండిపడ్డారు. మూడున్నరేళ్లైనా పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని ఆరోపించారు. 

రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని అన్నారు. మాయమాటలతో ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారని ప్రశ్నించారు. చెత్తపై కూడా పన్నలు వేసి దోచుకోవడం మంచి పద్దతా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించారు. అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అని అన్నారు. మూడున్నరేళ్లలో వైసీపీ ఉత్తరాంధ్రను అభివృద్ది చేయలేదని అన్నారు.  డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉంటే.. రాష్ట్రం వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.

ఇదిలా ఉంటే.. మూడు రాజధానుల పేరుతో సీఎం  జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్  సోము వీర్రాజు విమర్శించారు. మంగళవారం నాడు సోము వీర్రాజు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. పాలనపై వైసీపీ సర్కార్ కు  అవగాహన లేదన్నారు. కేంద్ర పథకాలను వైసీపీ సర్కార్ క్షేత్రస్థాయికి వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారని.. ఇసుక కొరతతో ఉపాధిలేక రోడ్డునపడ్డారని ఆయన ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులంతా ఈ-శ్రామ్ లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సోము వీర్రాజు సూచించారు. భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. 

రాష్ట్రంలో బంగారం సులభంగా దొరుకుతున్నా ఇసుక దొరకడం లేదని ఆయన విమర్శించారు. గతంలో కొంతమంది నాటుసారా తయారుచేసేవారన్నారు. సీఎం జగన్ పచ్చి బ్రాందీ తయారుచేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  వారం రోజులలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు.

click me!