మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు.
గుంటూరు:మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు.మంగళవారం నాడు సోము వీర్రాజు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. పాలనపై వైసీపీ సర్కార్ కు అవగాహన లేదన్నారు. కేంద్ర పథకాలను క్షేత్రస్థాయికి వెళ్లనివ్వడం లేదని ఆయన రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధిలేక రోడ్డునపడ్డారని ఆయన ఆరోపించారు.భవన నిర్మాణ కార్మికులంతా ఈ-శ్రామ్ లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సోము వీర్రాజు సూచించారు. భవన నిర్మాణరంగం కార్మికుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిందన్నారు.
undefined
రాష్ట్రంలో బంగారం సులభంగా దొరుకుతున్నా ఇసుక దొరకడం లేదని ఆయన విమర్శించారు. గతంలో కొంతమంది నాటుసారా తయారుచేసేవారన్నారు. సీఎం జగన్ పచ్చి బ్రాందీ తయారుచేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు..రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజులలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వీర్రాజు స్పస్టం చేశారు. ప్రతి జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు, ప్రజాప్రతినిధులు వందకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.. రాష్ట్రాన్ని పదిలక్షల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వీర్రాజు వివరించారు. నాడు-నేడు కింద రూ. 50వేలకోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్టుగా సోము వీర్రాజు తెలిపారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వానికి 6వేల 500 కోట్లు ఇచ్చినట్టుగా ఆయన గుర్తుచేశారు.ఆ నిధులను ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ సర్కార్ తెరమీదికి తీసుకు వచ్చింది. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే పాలనను వికేంద్రీకరణతోనే సాధ్యమని వైసీపీ భావించింది. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్ లో న్యాయ,. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ తలపెట్టింది.
also read:పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదు.. దురుద్దేశంతోనే ఇలా: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం
అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న ఆందోళనలు వెయ్యి రోజులకు చేరాయి. అమరావతి నుండి అరసవెల్లికి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రపై వైసీపీ తీవ్రంగా మండిపడుతుంది. ఉత్తరాంధ్రపై దండయాత్రగా ఈ పాదయాత్రను ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అభివర్ణించారు.