కరాచి బేకరీ ఎదుట నిరసన...ఆందోళనకారులపై బిజెపి నేత ఆగ్రహం

By Arun Kumar PFirst Published Feb 24, 2019, 2:42 PM IST
Highlights

జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలింసిందే. భారత జవాన్లను అతి దారుణంగా హతమార్చిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు పాక్ ఆశ్రయమిస్తోంది. అంతేకాకుండా పుల్వామాలో జరిగిన దాడిలో పాక్ హస్తముందని తేలింది. దీంతో పాకిస్థాన్ పేరెత్తితేనే భారతీయులు రగిలిపోతున్నారు. అలాంటిది ఆ దేశానికి చెందిన ఓ నగరం పేరుతో నిర్వహిస్తున్న బేకరీని వదిలిపెడతారా... ఇలా కరాచీ పేరుతో ప్రసిద్దిచెందిన హైదరాబాద్ కు చెందిన బేకరీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. 

ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ కరాచీ బేకరీ ఎదుట కొందరు ఆందోళనకారులు నిరసనకు దిగారు. పాకిస్థాన్ కు చెందిన ఈ బేకరీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కరాచీ పాకిస్తాన్‌కు చెందిన నగరం కావడంతో ఆ పేరుతో నిర్వహిస్తున్న బేకరీ కూడా ఆ దేశస్తులదే అయి వుంటుందన్న అనుమానంతో ఆందోళనకు దిగారు. అయితే అక్కడి సిబ్బంది ఇది హైదరాబాద్ కు చెందిన సంస్థ అని ఎంత చెప్పినా వారు వినరిపించుకోలేదు. దీంతో చేసేదేమిలేక బోర్డుపై కరాచీ అన్న పదం కనిపించకుండా కవర్ చేశారు. 

ఇలా కరాచీ బేకరి ఎదుట జరిగిన ఆందోళనను ఏపి బిజెపి నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికన స్పందించిన ఆయన ''ముక్తకంఠంతో ఇటువంటి పనికిమాలిన చర్యలను అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా విభజింపబడినా ఈ ఉపఖండం భౌగోళికంగా సాంస్కృతికంగా ఒకటే'' అంటూ ట్వీట్ చేశారు.  భారతీయుల ఐక్యమత్యాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రతిఒక్కరరూ  ఖండించాల్సిన అవసరముందని కృష్ణారావు సూచించారు. 
 
Let us in one voice condemn insane actions of bigots.culture of Indian sub continent is beyond political boundaries . ముక్తకంఠంతో ఇటువంటి పనికిమాలిన చర్యలను అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా విభజింపబడినా ఈ ఉపఖండం భౌగోళికంగా సాంస్కృతికంగా ఒకటే. pic.twitter.com/NUkTlsKoRp

— IYRKRao , Retd IAS (@IYRKRao)
click me!