ముందు గ్రాఫిక్సే తర్వాత బిల్డింగులు వస్తాయి: కేటీఆర్‌కు బాబు చురకలు

Siva Kodati |  
Published : Feb 24, 2019, 02:35 PM IST
ముందు గ్రాఫిక్సే తర్వాత బిల్డింగులు వస్తాయి: కేటీఆర్‌కు బాబు చురకలు

సారాంశం

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడిపోతారంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. 

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడిపోతారంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.

ఉండవల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన....జగన్ సీఎం అవుతారని కేటీఆర్ అంటున్నారని కానీ ఏపీలో మోడీ, కేసీఆర్, జగన్ కుట్రలు సాగవన్నారు. వాళ్లకు చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సూచించారు.

తెలంగాణలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అమరావతిలో అభివృద్ది ఏమీ లేదు... అంతా గ్రాఫిక్స్ అంటున్నారని అయితే ముందు గ్రాఫిక్స్ తర్వాత భవనాలు వస్తాయని చంద్రబాబు చురకలు అంటించారు.

జగన్ తనపై కులముద్ర వేస్తున్నారని, ఏపీని ప్రశాంత్ కిశోర్ మరో బీహార్‌లా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంతలా మారారని, హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏపీకి వెళ్లి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని కేసీఆర్ ఒత్తిడి తెస్తున్నారని ఎద్దేవా చేశారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu