నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టండి: బీజేపీ ఎంపీ జీవీఎల్

Published : May 25, 2022, 03:03 PM IST
నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టండి: బీజేపీ ఎంపీ జీవీఎల్

సారాంశం

అంబేద్కర్ పై ప్రేమ ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అమలాపురంలో నిన్న జరిగిన విధ్వంసాన్ని ఆయన ఖండించారు.  

అమరావతి:Ambedkar పై ప్రేమ ఉంటే Navaratnaluలకు ఆయన పేరు పెట్టొచ్చుగా అని ఎంపీ GVL Narasimha Rao నరసింహారావు ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

బుధవారంనాడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ పేరును ఏపీ ప్రభుత్వం వివాదంతోకి లాగిందన్నారు. 

Konaseemaలో నిన్న జరిగిన హింసను ఖండిస్తున్నామన్నారు. కోనసీమ ఆందోళనలో BJP  నేతలు ఎవరూ కూడా పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం YS Jagan క్షమాపణ చెప్పాలన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తుందని చెప్పారు. జిన్నా టవర్స్ పేరు మార్చాలని కోరితే మా నేతలను అరెస్ట్ చేశారన్నారు. హిందూ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వీడకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు.

కోనసీమలో హింస, ప్రణాళిక ప్రకారమే జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి Satya Kumar ఆరోపించారు.రాష్ట్రంలో ఓ మంత్రికే ఇలా జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. కోనసీమ విధ్వంసం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.  ఏడు నియోజకవర్గాల జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ ను ఆ జిల్లాకే పరిమితం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్