దేవాలయాలపై దాడులు: ఆందోళనకు సిద్ధమైన బీజేపీ- జనసేన

By Siva KodatiFirst Published Jan 17, 2021, 6:57 PM IST
Highlights

రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు నిరసనగా బీజేపీ-జనసేన ఉద్యమానికి సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న బీజేపీ జనసేన సంయుక్తంగా యాత్ర చేయనున్నాయి. ఆ రోజున తిరుపతి కపిలతీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకు యాత్ర నిర్వహించనున్నాయి ఇరు పార్టీలు

రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు నిరసనగా బీజేపీ-జనసేన ఉద్యమానికి సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న బీజేపీ జనసేన సంయుక్తంగా యాత్ర చేయనున్నాయి. ఆ రోజున తిరుపతి కపిలతీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకు యాత్ర నిర్వహించనున్నాయి ఇరు పార్టీలు.

దేవాలయాలపై దాడులు జరిగిన ప్రాంతాల్లో బీజేపీ యాత్ర జరుగుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యలపై 20 లోపు డీజీపీ స్పందించకపోతే మరో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

తిరుపతి ఉప ఎన్నికలో జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బరిలోకి దిగుతాడని వీర్రాజు ప్రకటించారు. బీజేపీ యాత్రను ప్రభుత్వం ఆపితే.. హిందువులను అడ్డుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా, ఆలయాలపై జరిగిన దాడుల వెనుక టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తముందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించడంతో తీవ్రదుమారం రేగింది. గౌతమ్ సవాంగ్ పొలిటీషన్ మాదిరిగా మాట్లాడుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:బీజేపీపై వ్యాఖ్యలు.. 20లోగా క్షమాపణలు చెప్పాలి: సవాంగ్‌కు వీర్రాజు అల్టీమేటం

తాజాగా డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సోము వీర్రాజు లేఖ రాశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కేసులో తమ పార్టీ బీజేపీ కార్యకర్తల హస్తమన్నట్లు ప్రకటించారని.. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలని డీజీపీని కోరారు.

సవాంగ్ ప్రకటన వల్ల మీడియాలో బీజేపీ కార్యకర్తలే దాడులు చేసినట్లు వార్తలు ప్రచురితమవుతున్నాయని సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ వివాదంతో బీజేపీ కార్యకర్తలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

అలాగే విగ్రహాలపై దాడులు చేయడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి చాలా తేడా ఉందని.. దేవాలయాలపై దాడులను అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వీర్రాజు విమర్శించారు. 

click me!