తిరుపతిలో బిడ్డ మాయం: శశికళ గర్భవతే కాదు.. తేల్చేసిన పోలీసులు

By Siva Kodati  |  First Published Jan 17, 2021, 5:39 PM IST

తన బిడ్డ మాయమైందంటూ తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో హల్ చల్ చేసిన మహిళ వ్యవహారానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఆమె అసలు గర్భం దాల్చలేదని విచారణలో తేలింది.


తన బిడ్డ మాయమైందంటూ తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో హల్ చల్ చేసిన మహిళ వ్యవహారానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఆమె అసలు గర్భం దాల్చలేదని విచారణలో తేలింది.

తాను నిన్నే బిడ్డకు జన్మనిచ్చానని.. కానీ బిడ్డను మాయం చేశారంటూ శశికళ ఆరోపించింది. దీంతో రిఫరల్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఆమె ప్రెగ్నెంట్ కాదని తేలింది. శశికళ గర్భవతి కాదని తేల్చేసింది రిఫరల్ ఆసుపత్రి. 

Latest Videos

undefined

కాగా శశికళ తన గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఆదివారం గొడవకు దిగింది. శశికళ అనే ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆమె ఆస్పత్రికి వచ్చారు. అయితే ఈసారి వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేసింది.

Also Read:తిరుపతి బిడ్డ మాయం కేసు: విషయం బయటపెట్టిన గూడూరు డాక్టర్లు

బిడ్డ కాన్పు కోసం వచ్చిన తనకు అసలు గర్భమే రాలేదని అంటున్నారని ఆస్పత్రి నిర్వాహకులతో ఆమె వాగ్వాదానికి దిగారు. గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల తీరును తప్పుపడుతూ ఆస్పత్రి ముందే నిరసన వ్యక్తం చేశారు.

మహిళ ఆరోపణపై ఆస్పత్రి వైద్యాధికారులు షాక్‌కు గురయ్యారు. ఆమె తీరుపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శశికళ కడుపులో ఉన్న గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

click me!