బీజేపీ, జనసేన నాయకులు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు సమావేశమై అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించారు.
టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కూటమి ఒప్పందం కుదిరిన తర్వాత కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు భేటీ అయ్యారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వీరు చర్చించారు.
ఈ భేటీ కోసం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదివారం విజయవాడకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో సమావేశమై బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు.
Also Read: Chanakya: చాణక్యుడి ఇమేజ్ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ధోనీ కనిపిస్తున్నాడే?!
ఈ సమావేశంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఒడిశా ఎంపీ బైజయంత్ పండా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం, మీడియాతో మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ నిరాకరించారు. మరోసారి సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడుతానని చెప్పారు.