టిడిపి ఎంపికి అవమానం

First Published Feb 12, 2018, 7:16 AM IST
Highlights
  • తన ఇంటికి రావాల్సిందిగా మచిలీపట్నం టిడిపి ఎంపి కొనకళ్ళ నారాయణ కేంద్రమంత్రిని ఆహ్వానించారు.

టిడిపి ఎంపికి అవమానం జరిగింది. ఇంటికి విందుకు వస్తానని మాటఇచ్చి మరీ తప్పటంతో ఎంపి అవమానంగా భావించారు. ఇంతకీ ఏమి జరిగిందంటే, మచిలీపట్నంకు ఆదివారం కేంద్రంమంత్రి ఆర్కె సింగ్ వెళ్ళారు. ఎటూ తన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి విందుకు తన ఇంటికి రావాల్సిందిగా మచిలీపట్నం టిడిపి ఎంపి కొనకళ్ళ నారాయణ కేంద్రమంత్రిని ఆహ్వానించారు. అందుకు కేంద్రమంత్రి కూడా సరేనన్నారు. దాంతో ఎంపి ఏర్పాట్లు చేసుకున్నారు.

సీన్ కట్ చేస్తే, ఆదివారం కేంద్రమంత్రి మచిలీపట్నం వెళ్ళారు తిరిగి వచ్చేశారు. కానీ ఎంపి ఇంటికి మాత్రం విందుకు హాజరుకాలేదు. విందుకు కేంద్రమంత్రి హాజరుకావటం లేదని మంత్రి కార్యాలయం నుండి కబురు అందటంతో ఎంపి ఆశ్చర్యపోయారు. తర్వాత జరిగింది తెలుసుకుని అవమానంగా ఫీల్ అయ్యారు.

ఇంతకీ ఏమి జరిగింది? అంటే,  టిడిపి ఎంపి ఇంటికి బిజెపి కేంద్రమంత్రి విందుకు వెళ్ళే కార్యక్రమాన్ని స్ధానిక బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఒకవైపు పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడిని అమ్మనాబూతులు తిడుతున్న టిడిపి ఎంపి ఇంటికి బిజెపి కేంద్రమంత్రి ఎల వెళతారంటూ బిజెపి నేతలు మండిపడ్డారు. బడ్జెట్ నేపధ్యంలో గడచిన పదిరోజులుగా పార్లమెంటులోను, రాష్ట్రంలోను  జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే కదా?

ఈ నేపధ్యంలోనే బిజెపి నేతలు కేంద్రమంత్రి వద్ద తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో కేంద్రంమత్రి తన విందు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కేంద్రమంత్రి కోసం ఎదురుచూస్తున్న ఎంపి కార్యాలయానికి చల్లగా అసలు విషయం తెలిసిందే. దాంతో బిజెపి తనను అవమానించినట్లుగా టిడిపి ఎంపి భావిస్తున్నారు. ఇటువంటి ఘటనలే రేపు పెద్దవై రెండు పార్టీల మధ్య గ్యాప్ ను మరింత పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

click me!