
అనంతపురం జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.25 కోట్ల మేర అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూను ఉద్దేశపూర్వకంగా తగ్గించి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం సమర్పించారు.