చంద్రబాబుకు మధ్యంతర బెయిల్: స్వాగతించిన పురంధేశ్వరి

By narsimha lode  |  First Published Oct 31, 2023, 11:32 AM IST


చంద్రబాబుకు  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి  స్వాగతించారు.


అమరావతి:టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి  స్వాగతించారు. మంగళవారంనాడు ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయమై స్పందించాలని  పురంధేశ్వరిని మీడియా ప్రతినిధులు కోరారు. చంద్రబాబుకు  మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతించారు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, విచారించకుండానే అరెస్ట్ చేయడాన్ని తాము తప్పుబట్టిన విషయాన్ని పురంధేశ్వరి గుర్తు చేశారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును  ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు.  ఈ కేసులో  అరెస్టైన చంద్రబాబు  జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  ఈ కేసులో  చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల  నేపథ్యంలో  ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  

Latest Videos

undefined

చంద్రబాబు అరెస్ట్ సమయంలో బీజేపీపై  కొందరు టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను  ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  కలిశారు.ఆ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పురంధేశ్వరి కూడ  ఉన్నారు.  చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ హస్తం ఉంటే  అమిత్ షా లోకేష్ కు ఎందుకు అపాయింట్ మెంట్ ఇస్తారని  పురంధేశ్వరి  ప్రశ్నించిన విషయం తెలిసిందే .

also read:చంద్రబాబుకు ఊరట: స్కిల్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా లోకేష్ అమిత్ షా ను కలిశారని  ప్రచారం సాగుతుంది.అమిత్ షా కలవాలనుకుంటున్నారని  కిషన్ రెడ్డి  చెబితే తాను వెళ్లి  అమిత్ షాను కలిసినట్టుగా  లోకేష్  ప్రకటించిన విషయం తెలిసిందే.  అమిత్ షా అపాయింట్ ను లోకేష్ కు ఎవరు ఇప్పించారనే విషయమై అప్రస్తుతమని అప్పట్లోనే పురంధేశ్వరి ప్రకటించిన విషయం తెలిసిందే . చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని పురంధేశ్వరి మొదటి నుండి చెబుతున్నారు.  చంద్రబాబు అరెస్ట్ ను  పురంధేశ్వరి  తప్పు బట్టడాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎద్దేవా చేశారు.  టీడీపీకి పురంధేశ్వరి మద్దతిస్తున్నారా అని ప్రశ్నించారు.
 

click me!