వినాయకచవితి పండుగపై ఆంక్షలా?: నిరవధిక దీక్ష చేస్తానంటున్న సోము వీర్రాజు

By narsimha lode  |  First Published Sep 5, 2021, 12:28 PM IST


 వినాయక చవితి  పండుగపై  ఆంక్షలపై  బీజేపీ ఏపీ రాష్ట్ర చీఫ్  సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం ఈ ఆంక్షలను ఉపసంహరించుకోకపోతే  ఇవాళ్టి నుండి నిరవధిక నిరసనకు దిగుతానని  సోము వీర్రాజు హెచ్చరించారు.



కర్నూల్: వినాయకచవితి పండుగ  విషయంలో ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఆంక్షలను ఉపసంహరించకపోతే ఇవాళ్టి నుండి నిరవధిక నిరసనకు దిగనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కి ఆయన  ఇంటర్వ్యూ ఇచ్చారు.  కరోనా నిబంధనలు హిందూవుల పండుగలకేనా అని ఆయన ప్రశ్నించారు.  ఇతర మతాల పండుగలకు ఈ ఆంక్షలు వర్తించవా అని సోమువీర్రాజు అడిగారు.

Latest Videos

వినాయక విగ్రహలు బయట ఏర్పాటు చేస్తే అరెస్ట్ చేస్తామని డీజీపీ ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆయన విమర్శించారు.  రంజాన్, క్రిస్మస్, మొహర్రం పండుగలపై లేని ఆంక్షలు వినాయకచవితికి ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఇళ్లలో పూజలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పాలా అని సోమువీర్రాజు అడిగారు. ఇళ్లలో పూజలకు ప్రభుత్వ అనుమతి అవసరమా అని వీర్రాజు మండిపడ్డారు. వినాయకచవితిపై ప్రభుత్వ నిర్ణయం, డీజీపీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.  లేకపోతే ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి నిరవధిక నిరసనకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

click me!