తిరుమలలో అన్యమత ప్రార్ధనలు: మంత్రులపై సోము వీర్రాజు సంచలనం

By narsimha lode  |  First Published Sep 7, 2022, 9:38 AM IST

తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేశారని  బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. 


తిరుమల: తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారని బీజేపీ ఏపీ చీప్ సోము వీర్రాజుఆరోపించారు.బుధవారం నాడు తిరుమలలో  వెంకటేశ్వరస్వామిని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.పవిత్రమైన తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో అన్యమత ప్రార్ధనలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ టైమ్ అభివృద్ది జరగాలలని తాను  తిరుపతి వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్  అభివృద్దికి అనువైన రాష్ట్రమని సోము వీర్రాజు తెలిపారు.అయితే ఏపీ రాష్ట్రం సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Latest Videos

undefined

రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆయన విమర్శించారు. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. అన్నదాతల విషయంలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సోము వీర్రాజు చెప్పారు.  అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీ సర్కార్ కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ భూ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తామని వీర్రాజు తెలిపారు. 

తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారని గతంలో కూడా బీజేపీ ఆరోపణలు చేసింది. ఇతర మతాలకు చెందిన వారు తిరుమల కొండపై తమ మతం కోసం ప్రచారం చేశారని బీజేపీ నేతలు ఆరోపణలు చేసినవిషయం తెలిసిందే.ఈ విషయమై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను టీటీడీ అధికారులు కొట్టివేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం లేదా ప్రార్ధనలు చేసే వారిని ఉపేక్షించబోమని కూడా టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

also read:భరత నాట్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ప్రావీణ్యం: గురుపూజోత్సవంలో సోము వీర్రాజు

ఇదిలా ఉంటే తిరుమలలో  మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేశారని  బీజేపీ ఏపీ  చీఫ్ సోము వీర్రాజు చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.  తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనే క్రమంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కల్గించేలా మంత్రులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా విన్పిస్తున్నాయి. మంత్రులు తమ అనుచరులతో పెద్ద సంఖ్యలో వచ్చి వీఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకోవడంతో గంటల తరబడి సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 
 

click me!