ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు.. టీడీపీ కార్యకర్త ఉండవల్లి అనూషకు పోలీస్ నోటీసులు..

Published : Sep 07, 2022, 07:44 AM IST
ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు.. టీడీపీ కార్యకర్త ఉండవల్లి అనూషకు పోలీస్ నోటీసులు..

సారాంశం

సింగనమల ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో.. ఐ-టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసు జారీచేశారు.

ఏలూరు :  అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని అభియోగంపై ఐ-టిడిపి అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసు జారీ చేశారు. ఏలూరు ఆర్ఆర్ పేటలో ఆమె బట్టల షాప్ కు వచ్చిన అనంతపురం పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన అనూష..  పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్న సోషల్ మీడియాల ఐడిలు తనవి కావని అన్నారు.

ఎవరో ఫిర్యాదు చేస్తే అనంతపురం నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. అయితే, ఎమ్మెల్యే పద్మావతిపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సింగనమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా కరెంట్ షాక్..ఒకరు మృతి...

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?