కోళ్లు కొనడానికి వచ్చి.. బాలికపై అత్యాచారం.. అరెస్ట్..

Published : Jan 07, 2022, 12:07 PM IST
కోళ్లు కొనడానికి వచ్చి.. బాలికపై అత్యాచారం.. అరెస్ట్..

సారాంశం

ఒక వ్యక్తి కోళ్ల కోసం వచ్చి… కోళ్లను బేరమాడసాగాడు. ఈ క్రమంలో అతని కన్ను బాలిక మీద పడింది. అదే సమయంలో  లో ఇంటి పరిసరాలు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని గమనించాడు.  బాలికను మంచినీళ్లు  ఇమ్మని అడిగాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారణ నిర్ధారణ  చేసుకున్నాడు. ఆ తర్వాత నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు.  ఆ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేసినప్పటికీ వారి ఇల్లు  ఊరికి దూరంగా ఉండడంతో  ఎవరికీ వినిపించలేదు.

విజయనగరం : ఎస్ కోట మండలంలో కోడిని కొనే నెపంతో ఇంట్లో చొరబడిన ఓ దుండగుడు పదవ తరగతి చదువుతున్న minor girlపై Sexual assaultకి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. దీంతో అదే రోజు రాత్రి గ్రామ పెద్దలతో కలిసి బాలిక తల్లిదండ్రులు ఎస్. కోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించి  గురువారం తెలిసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఒక గ్రామానికి చెందిన farmer దగ్గర ఓ వ్యక్తి రైతరికం కోసం చేరాడు.

భార్య, పదవ తరగతి చదువుతున్న కూతురితో కలిసి ఉంటున్న ఆ వ్యక్తి  కోళ్లను పెంచి అమ్ముతూ ఉంటాడు.  అయితే బుధవారం ఆ వ్యక్తి కుమార్తెను ఇంటివద్దనే ఉంచి భార్యతో కలిసి పనిమీద శృంగవరపుకోట పట్టణానికి వెళ్ళాడు.

అదే సమయంలో గంట్యాడ మండలం, బోనంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కోళ్ల కోసం వచ్చి… కోళ్లను బేరమాడసాగాడు. ఈ క్రమంలో అతని కన్ను బాలిక మీద పడింది. అదే సమయంలో  లో ఇంటి పరిసరాలు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని గమనించాడు.  బాలికను మంచినీళ్లు  ఇమ్మని అడిగాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారణ నిర్ధారణ  చేసుకున్నాడు. ఆ తర్వాత నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు.  ఆ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేసినప్పటికీ వారి ఇల్లు  ఊరికి దూరంగా ఉండడంతో  ఎవరికీ వినిపించలేదు.

బాలికపై  లైంగిక దాడికి పాల్పడిన దుండగులు ఆ తర్వాత పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన ఘోరం చెప్పింది. వారు వెంటనే గ్రామ పెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ కేసు విషయమై  సిఐ సింహాద్రి నాయుడు మాట్లాడుతూ త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. Hyderabadలోని ఉప్పల్ లో ఈ కిరాతకమైన సంఘటన చోటు చేసుకుంది. కుమారుడి పట్ల తండ్రి అత్యంత నీచంగా, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. జుగుస్స కరమైన ఈ ఘటనను తల్లి వ్యతిరేకించింది. 

సొంత కుమారుడిని Fatherభరత్ రెడ్డి Sexual harassmentకు గురి చేస్తున్నాడు. ఇది తెలిసిన భరత్ రెడ్డి wife ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భరత్ రెడ్డితో వీణారెడ్డికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. భరత్ నుంచి తన కుమారుడిని రక్షించాలని వీణారెడ్డి పోలీసులను కోరింది.

భరత్ రెడ్డి, వీణారెడ్డి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో కుమారుడు కొన్ని రోజులు తండ్రి వద్ద, మరికొన్ని రోజులు తల్లి వద్ద ఉంటున్నాడు. కుమారుడు తన వద్ద ఉన్నప్పుడు తండ్రి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా భర్త భరత్ రెడ్డిపై వీణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్