పొత్తులపై భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పు కాదు:పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Jan 6, 2024, 3:20 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులపై పార్టీలో చర్చించినట్టుగా  బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  పురంధేశ్వరి చెప్పారు.
 


అమరావతి: పొత్తులపై  పార్టీలోని అందరి నేతల అభిప్రాయాలను తీసుకున్నట్టుగా  భారతీయ జనతా పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి  చెప్పారు. శనివారంనాడు ఆమె  ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పొత్తులపై  పార్టీలోని  అందరి నేతల అభిప్రాయాలను తీసుకొని జాతీయ నాయకత్వానికి పంపినట్టుగా పురంధేశ్వరి చెప్పారు. జనసేనతో  తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని ఆమె చెప్పారు. పొత్తులపై  తుది నిర్ణయం  ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారని పురంధేశ్వరి తెలిపారు. పొత్తులపై పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తప్పు కాదన్నారు. 

also read:విమానంలో మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  బీజేపీ  ముఖ్య నేతలు ఈ నెల  3,4 తేదీల్లో విజయవాడలో సమావేశమయ్యారు.  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై  చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులపై  కూడ  చర్చించారు.ఈ  నెల  4వ తేదీన  బీజేపీ సమావేశం ముగిసిన తర్వాత  జనసేన  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్  నాదెండ్ల మనోహర్  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో చర్చించారు.

also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపునకు కావాల్సిన ఓట్లను ఎలా నిర్ధారిస్తారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి.  ఈ విషయాన్ని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  2023 సెప్టెంబర్ మాసంలో ప్రకటించారు.  ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.

also read:అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం: జీవో జారీ చేసిన ఏపీ సర్కార్

ఈ కూటమిలో బీజేపీ కూడ చేరుతుందనే ఆశాభావాన్ని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత  పొత్తులపై బీజేపీ నాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
 

click me!