అంగన్ వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. అంగన్ వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
అంగన్ వాడీలపై ఎస్మాను ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. ఈ మేరకు ఇవాళ జీవో 2ను జారీ చేసింది. తమ వేతనాలను పెంచాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనంలో కోత పడింది.సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత వేసింది జగన్ ప్రభుత్వం.అంగన్ వాడీ వర్కర్లకు గత నెల వేతనం రూ. 8050 జమ చేసింది ప్రభుత్వం.వేతనంలో సుమారు రూ. 3 వేలు కోత విధించింది ప్రభుత్వం.
undefined
వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని అంగన్ వాడీలు ఆరోపిస్తున్నారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ వర్కర్లు దాదాపుగా 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు.దీంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె నిర్వహిస్తున్నారు.
సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ నే ఎస్మాగా పిలుస్తారు.సమ్మెలు, ఇతరత్రా నిరసన కార్యక్రమాలతో ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుంగా ఉండేందుకు గాను 1981లో ఎస్మా చట్టాన్ని రూపొందించారు. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా సమ్మెలోకి దిగితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. 1981లో కార్మికు సంఘాలు ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఎస్మా చట్టం తెచ్చింది. ఎస్మాను ఉల్లంఘిస్తే వారంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు.