మాజీ మంత్రి నారాయణ కాలర్ పట్టుకున్న వైసీపీ విద్యార్థి నేత

Published : Dec 04, 2019, 07:24 AM IST
మాజీ మంత్రి నారాయణ కాలర్ పట్టుకున్న వైసీపీ విద్యార్థి నేత

సారాంశం

నారాయణ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ కాలేజీల్లో ఫీజుల పేరుతో వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేత ఆవుల రాఘవేంద్ర.. నారాయణ షర్ట్ కాలర్ పట్టుకున్నారు.   

మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది.  మంగళవారం నారాయణ అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. కాగా... అక్కడ ఆయనను పలు విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. 

నారాయణ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ కాలేజీల్లో ఫీజుల పేరుతో వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేత ఆవుల రాఘవేంద్ర.. నారాయణ షర్ట్ కాలర్ పట్టుకున్నారు. 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థలను మూసివేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ ఘటనకుసంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

జగన్ ఇలాకాలో టీడీపీ ప్రభంజనం.. స్థానిక ఎన్నిక‌లో సైకిల్ పార్టీ హ‌వా
Bats Village : తలకిందులుగా వేలాడే గబ్బిలాలను పూజించే వింత గ్రామం.. ఎక్కడుందో తెలుసా?